17 జూన్, 2012

హాట్ న్యూస్:చెర్రీగా రామ్ చరణ్,జిలేబిగా బ్రహ్మానందం




వినాయిక్,రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బ్రహ్మానందం జిలేబి అనే పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అదుర్స్ తరహాలో బ్రహ్మానందం,రామ్ చరణ్ మధ్య కామెడీ అదరేలా రచయిత ఆకుల శివతో వినాయిక్ రెడీ చేయించాడని చెప్తున్నారు.
ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రంలో కాజల్,అమలా పౌల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు.

రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ''నాన్నగారితో 'ఠాగూర్" లాంటి మంచి సినిమా తీశారు వినాయక్‌గారు. దానయ్యగారు కూడా మంచి సినిమాలు తీసిన నిర్మాత. వారి కాంబినేషన్‌లో సాగిపోయే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది" "అని రామ్‌చరణ్ అన్నారు. ఈ సినిమాకి తను ఇచ్చిన కథ కుదరడం ఆనందంగా ఉందని రచయిత ఆకుల శివ చెప్పారు. కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు).

ఇక ఈ చిత్రంపై దర్శక,నిర్మాతలు బాగా నమ్మకంగా ఉన్నారు. రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయటం ప్లస్ అవుతుందని చెప్తున్నారు. అలాగే చిత్రంలో కామెడీ,యాక్షన్ బాగా కుదిరాయని,అదుర్స్ నాటి మ్యాజిక్ మళ్లీ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఆకుల శివ కాంబినేషన్ లో గతంలో లక్ష్మి,కృష్ణ,అదుర్స్ చిత్రాలు వచ్చాయి.

4 కామెంట్‌లు:

Murthy K v v s చెప్పారు...

I LIKE THIS BLOG VERY MUCH.

MURTHY

Murthy K v v s చెప్పారు...

I LIKE THIS BLOG VERY MUCH.

MURTHY

అజ్ఞాత చెప్పారు...

రామ్ చరణ్ కి చెర్రీ అని పేరుపెట్టిన బుద్ధితక్కువవాళ్ళెవరో ? ఒక భారతీయ పేరుని చాలా బాగా పాశ్చాత్యీకరించేశామనుకున్నారో ఏంటో ? ఈ ఛెర్రీ అనే మాటకి అమెరికన్ శ్లాంగ్ లో యోని అనే అర్థం ఉంది.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత, Jaws అనే పేరు పెట్టివుండాల్సింది.