13 జూన్, 2012

సీనియర్ హీరోకి గొంతు కాన్సర్ అంటూ...

                                                No Throat Cancer Throat Pain Karthik


తెలుగులో అభినందన, సీతాకోకచిలక, మగరాయుడు వంటి చిత్రాలలో నటించిన కార్తీక్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయనికి రీసెంట్ గా గొంతు కాన్సర్ వచ్చిందంటూ మీడియాలో పెద్ద రూమర్ బయిలుదేరింది. దాంతో ఆయన శ్రేయాభిలాషులు,మిత్రులు అంతా ఆయనకి ఫోన్స్ చేయటం మొదలెట్టారు. దానికి ఆయన తనకు వచ్చింది ధ్రోట్ పెయిన్ మాత్రమే నని,ధ్రోట్ కాన్స్రర్ కాదని ఆయన ప్రకటన చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే మొన్న ఆదివారం ఆయన చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో స్కానింగ్,మరికొన్ని టెస్ట్ లు చేయించుకున్నారు. ధ్రోట్ కి సంభందించిన ఇబ్బందితో ఆయన భాధపడుతూ హాస్పటిల్ కి వెళ్లారు. దాంతో ఆ విషయం తెలుసుకున్న మీడియా దానికి కాస్త మసాలా అద్ది వదిలింది. కార్తీక్ కి ధ్రోట్ కాన్సర్ అంటూ ప్రచారం మొదలెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులు,శ్రేయాభిలాషులు కంగారుపడిపోయారు. ఇప్పటికి కూడా ఆయనకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు.
ఇక కార్తీక్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చెయ్యటం లేదు. ఆయన కుమారుడు గౌతమ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన మణిరత్నం దర్శకత్వంలో ఆయన సినిమా ప్లాన్ చేసారు. ఆ సినిమా పేరు కడల్. అతనికి జంటగా హాట్ ముద్దుగుమ్మ సమంత ని మొదట బుక్ చేసారు. కానీ ఆమె ఏజ్ పెద్దదిగా కనిపించటంతో ఆమెను తీసేసి కార్తీక చెల్లెను తీసుకున్నారు. ఇతర ప్రధానపాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, అరవింద్ స్వామి, మోహన్‌బాబు కుమారుడు లక్ష్మీప్రసన్న, తంబిరామయ్య తదితరులు నటిస్తున్నారు.
జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇందు కోసం రూ. 25 కోట్ల వరకు ఆఫర్ చేశారని తమిళ సినీ వర్గాల సమాచారం. మణిరత్నం ఈ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నా ఈ రేంజ్‌లో ఆఫర్ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండగా, రాజీవ్‌మీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శ్రీకార్ ప్రసాద్ కూర్పు బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.
మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లవ్ స్టోరీ కావడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే జెమినీ ఫిల్మ్స్ వారు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడానికి ముందుకు వచ్చిందని తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. మరి వారి నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

కామెంట్‌లు లేవు: