వెంకటేష్, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఫస్ట్ లుక్,టీజర్ ని మొన్న కృష్ణ పుట్టిన రోజైన మే 31,2012 న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దూకుడు చిత్రం సెప్టెంబర్ 23న విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసింది.
ఇక ఈ చిత్రం ఆడియో రైట్స్ కు కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఆదిత్యా మ్యూజిక్ ఆడియో వారు ఈ చిత్రం రైట్స్ ని హెవీ కాంపిటేషన్ లో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి మంచి మెలోడి మ్యూజిక్ అందించాడని,ఆడియో పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి అన్నారు.
అలాగే దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ సినిమా గురించి చెపుతూ.. 'ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు. పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి