అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్
రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఆడియో విడుదలై ట్రేడ్
వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటివరకూ చేయని ఓ డిఫెరెంట్ పాత్రను చేస్తున్నారు. అడ్డదారిలో వెళ్లి ఎదగాలనుకునే వ్యక్తి కధ అని తెలుస్తోంది.
కథ ప్రకారం...నాన్నకున్న బాకీలు, చెల్లాయికి కట్టిన రాఖీలు, ఒంటికున్న
టీకాలు... ఇది కాదు చరిత్ర అని నమ్మే అల్లరి కుర్రాడతను. మాటలే కాదు,
పద్ధతీ కాస్త తికమకగానే ఉంటుంది. జీవితంలో స్థిరపడిపోవాలంటే చాలా
కష్టపడాలి. అదే... కాస్త అడ్డదారి వెతుక్కున్నామంటే క్షణాల్లో రాజులా
వెలిగిపోవచ్చు. కాకపోతే కాస్త రిస్క్ చేయాలి. అది చేయడానికీ సిద్ధమయ్యాడు.
ఇంతకీ ఆ సాహసం ఏమిటి? హాయిగా జులాయిగా బతికేసే అతని జీవితంలో ఎలాంటి
సంఘటనలు ఎదురయ్యాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే 'జులాయి' చూడాల్సిందే.
ఈ
చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో 'లాయి లాయి... జులాయి' అనే పాట
తెరకెక్కిస్తున్నారు. శేఖర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. నిర్మాత
మాట్లాడుతూ ''ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు
మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఎంత హుషారుగా ఉంటాయో,
అల్లు అర్జున్ నృత్యాలు అంత ప్రత్యేకంగా ఉంటాయి. త్రివిక్రమ్ శైలిలో
సాగిపోయే సంభాషణలు ఆకట్టుకొంటాయి. వచ్చే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం
ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర
కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే
జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి,
దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు
సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ
జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.
సమర్పణ: డి.వి.వి.దానయ్య. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట
శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి