18 జూన్, 2012

నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ కథేంటి?





















దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటోనగర్ సూర్య'. ఈ చిత్రాన్ని అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది.

దర్శకుడు దేవకట్టా చిత్రం గురించి మాట్లాడుతూ...''ఆటోనగర్‌ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. తెలిసిన పని చేసుకొంటూ, ప్రాంతానికి తగ్గట్టు ఎదగాలనే మనస్తత్వమున్న సూర్యపై ఓ అందమైన అమ్మాయి మనసుపడుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? లేదా? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి. వినోదం, యాక్షన్‌ అంశాలకు ప్రాధాన్యముంది. నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెడుతున్నాము''అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ...కందెన మరకన్నా, ఆయిల్‌ వాసనన్నా అతనికి చాలా ఇష్టం. ఎందుకంటే... అవన్నీ కలగలిసిన ఆటోనగర్‌ మట్టిలోనే ఆ కుర్రాడు ఎదిగాడు. ఒకప్పుడు అనామకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ఊరెళ్లి సూర్య అంటే చాలు... ఆ ఆటోనగర్‌ అబ్బాయేనా? అంటూ ఆరా తీస్తారు. ఇంతకీ ఆ కుర్రాడు అంతగా పేరు ఎలా సంపాదించాడు? తన ప్రాంతం కోసం, తనని నమ్ముకొన్నవారి కోసం ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు. 


మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు. ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.




కామెంట్‌లు లేవు: