తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా వంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు విష్ణు
వర్ధన్. ఆయన తన తదుపరి చిత్రాన్ని తమిళంలో అజిత్ తో ప్లాన్
చేసుకుంటున్నారు. ఈసారి పంజా ని మళ్లీ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ
మేరకు ఆయన సుభా అనే రచయితతో స్క్రిప్టు పై కసరత్తులు చేస్తున్నట్లు
చెప్పుతున్నారు. తెలుగులో మైనస్ గా నిలిచిన అంశాలు మార్చి ఈ చిత్రాన్ని
రీరైట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇక గతంలో అజిత్, విష్ణు వర్ధన్
కాంబినేషన్ లో బిల్లా చిత్రం వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దాంతో వీరి
కాంబినేషన్ పై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ బిల్లా- 2
చేస్తున్నారు. నిజానికి బిల్లా చిత్రానికి దర్శకత్వం వహించిన
విష్ణువర్దన్‌నే బిల్లా -2 కు పని చేయాల్సింది. ఆయన తెలుగు చిత్రం పంజాను
ఒప్పుకోవడంతో బిల్లా- 2కు చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర
విడుదలకు సిద్దమైంది. డేవిడ్ బిళ్లా టైటిల్ తో ఈ చిత్రం తెలుగులో విడుదల
అవుతోంది.
అజిత్,విష్ణువర్దన్ల కాంబినేషన్ విషయాన్ని అజిత్ తన
ట్విట్టర్లో పేర్కొన్నారు. బిల్లా తర్వాత అజిత్‌తో మరో చిత్రం
చేయనున్నానని తెలిపారు. తమ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో
భారీ అంచనాలు ఉంటాయన్న విషయం తెలుసన్నారు. ఇక పవన్ తో చేసిన పంజా గురించి
విష్ణు వర్దన్ మాట్లాడుతూ..''పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని... ఆ
అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో ఎస్.జె.సూర్యకు నేను
కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన వల్లే అవకాశం దక్కింది'' అన్నారు
విష్ణువర్థన్.
అజిత్ తాజా చిత్రం ‘డేవిడ్ బిల్లా'మరో రికార్డుని
క్రియేట్ చేసింది. ఈ చిత్రం పదమూడు ప్రెంచ్ సిటీలలో రిలీజవుతోంది. ఇలా
ప్రెంచ్ సబ్ టైటిల్స్ ఇంత భారీగా రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే
కావటం విశేషం. అలాగే భారతీయ సినీ చరిత్రలోనే బిల్లా 2 చిత్రం తొలి
ప్రీక్వెల్ చిత్రంగా రికార్డు సృష్టించింది. అజిత్‌ని స్టయిలిష్‌గా
ఆవిష్కరించిన చిత్రం ‘బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం
ఎలా ఉండబోతోందనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం త్వరలో
తెలుగులోకి డబ్ ఇక్కడ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ
చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి
పెరిగింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి