జూన్ 29న 'అమేజింగ్'కు అర్దం చెప్పనున్న సినిమా..!
ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరిస్ చిత్రాలకు గల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకునే చిత్రం సరిక్రొత్త సాంకేతిక మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం మంత్ర ముగ్దుల్ని చేసేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబై 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్' అనే పేరుతో విడదలవుతొంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మార్క్ వెబ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సోని పిక్చర్స్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో ప్రపంచం అంతటా 2డి మరియు 3డి వెర్షన్లలో 200 పైగా ధియేటర్లలో విడుదవుతొంది.
కొత్త కథ - సరిక్రొత్త సాహాసకృత్యాలతో రూపొందించిన ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ గా ఆండ్రూ గార్ ఫీల్డ్ నటించగా.. అతని ప్రియురాలిగా ఎమ్మా స్టోన్ నటించింది. బాలీవుడ్ ఇర్పాన్ ఖాన్ మరో ముఖ్య పాత్రను ఈ సినిమాలో పోషించాడు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ప్రీమియర్ షోలో దర్శకుడు మాట్లాడుతూ తన తండ్రి ఎవరో తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో తనను తాను తెలుసుకునే ఓ వండర్ కిడ్ కథే 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్'. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్'ని రూపొందించాం అని అన్నాడు.సోని పిక్చర్స్ ప్రతినిధి ఈ చిత్రం విడుదల గురించి మాట్లాడుతూ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో గల విశేష్ ఆదరణను దృష్టిలో పెట్టుకోని 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్' సినిమాని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో 200 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని అన్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. టైటిల్‌లో ఉన్న అమేజింగ్ అనే పేరుకు తగ్గట్లే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను జూన్ 29న ఇండియాలో విడుదల చేయనున్నారు.
ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్ నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు:
ప్రొడక్షన్ కంపెనీ: కొలంబియా పిక్టర్స్
దర్శకుడు: మార్క్ వెబ్
రచయితలు: జేమ్స్ వాండర్బిల్ట్ (స్క్రీన్ ప్లే), ఆల్విన్ సార్జంట్ (స్క్రీన్ ప్లే)
స్టార్స్: ఆండ్రూ గార్ఫీల్డ్, ఎమ్మా స్టోన్ మరియు రిస్ ఇఫాన్స్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి