టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,
విక్టరీ వెంకటేష్ మల్టీ స్టరర్‌గా రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో
జరుగుతోంది. షూటింగు కోసం కోసం ఇక్కడ రూ. కోటితో భారీ హౌస్ సెట్ వేశారు.
ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ ఈ సెట్‌ను డిజైన్ చేశారు. సెట్ చాలా
బాగుందని, నాచురల్ గా ఉందని మహేష్ బాబు, వెంకటేష్, ప్రకాష్ రాజ్
మెచ్చుకున్నారని మరో నిర్మాత బిఎ రాజు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్
రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్,
సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా ఈచిత్రం రూపొందుతోంది. మహేష్
బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి రొమాన్స్
చేస్తోంది.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెపుతూ నిర్మాత దిల్ రాజు ఆ
మధ్య మాట్లాడుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది?
ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు.
ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో
రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని,
వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో
కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా
సినిమాలో చూడొచ్చు అన్నారు.
పూర్తి కుటుంబ కథా చిత్రం రూపొందుతున్న
ఈచిత్రం మహేష్ బాబు గత సినిమాలకు భిన్నంగా... మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్
ఆడియన్స్‌ను మెప్పించేలా అన్ని చిత్రీకరిస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం
ప్రేక్షుకుల తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సంగీతం:
మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి