పవన్ సూపర్ హిట్ 'గబ్బర్ సింగ్'డైలాగు పేరడీ చేస్తూ అల్లరి నరేష్
'సుడిగాడు'చిత్రం వార్తల్లో నిలిచింది. అయితే తాను ఎవరినీ కించపరచాలని
అలాంటి కామెడీ చేయలేదు అంటున్నారు నరేష్. ఆయన మాట్లాడుతూ... ఈ చిత్రంలలో
2000 నుంచి ఇప్పటి వరకూ వచ్చిన విజయవంతమైన సినిమాల్లోని సన్నివేశాలకు
పేరడీలు చేశాం. ఇన్నాళ్లూ ఒకట్రెండు సన్నివేశాల్లోనే పేరడీ చేసేవాణ్ని.
'సుడిగాడు' నిండా అలాంటి సరదాలే ఉంటాయి. అలాగని ఎవరినీ కించపరచలేదు
అన్నారు.
అలాగే 'సుడిగాడు'చిత్రం లో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాను. తండ్రీకొడుకులుగా కనిపిస్తా. ఎప్పట్లాగే నవ్విస్తాను అని అల్లరి నరేష్ చెప్పారు. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు.
'సుడిగాడు'కి ట్యాగ్
లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి
నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్ గజ్జర్
హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్.డి.రెడ్డి నిర్మాత.మోనాల్
గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని
శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్
పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ
సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని
కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు
గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు
రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్
చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. చంద్రమోహన్, బ్రహ్మానందం,
అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర
పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం:
శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి