ముంబై: హిందీ నటుడు సోహైల్ ఖాన్ కారు ఓ మహిళను బలి తీసుకుంది. సోహైల్ ఖాన్ కారు ఢీకొని ఓ 60 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున ముంబైలోని బంద్‌స్టాండులో జరిగింది. సోహైల్ ఖాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళ
రోడ్డు దాటుతుండగా సోహైల్ ఖాన్ వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టినట్లు
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే ఆమోను బాబా ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. కారులో సోహైల్ ఖాన్
లేనట్లు చెబుతున్నారు.
సోహైల్ ఖాన్ కారును నడపడం లేదని పోలీసులు
చెప్పారు. ఆయన ఓ రియాల్టీ షో షూటింగులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం
జరిగనప్పుడు ఆయన కామెడీ సర్కస్ షూటింగులో ఉన్నట్లు సమాచారం. సోహైల్ ఖాన్
ప్రముఖ సినీ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు.
నిర్మాత, దర్శకుడిగా సోహైల్
ఖాన్ తన సినీ జీవితాన్ని ఆరంభించారు. ఆయన ఔజార్ సినిమా ద్వారా 1997లో
దర్సకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మైనే ప్యార్ క్యొం కియా సినిమా
ద్వారా 2005లో నటుడిగా పరిచయమయ్యారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి