బెంగళూర్: ఓ మహిళా టెక్కీ మృతి కేసు మలుపు తిరిగింది. 27 ఏళ్ల
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. ఆమె శనివారం రాత్రి
బెంగళూర్‌లోని బ్యాపనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంట్లో సీలింగ్
ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో టెక్కీ షేక్ షబాన ఆత్మహత్య
చేసుకుందని భావించారు. కానీ ఆమె తల్లి ఆమెను హత్య చేసినట్లు
ఆరోపిస్తున్నారు.
తన కూతురిని ఆమె భర్త షేక్ సదానీ పాషా కట్నం కోసం
హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అతను చాలా కాలంగా కట్నం కోసం తన కూతురిని
వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. పాషా కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. తన
భార్య షబానా నగరవారపాలయలోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని పాషా చెప్పాడు.
పాషా వాంగ్మూలం ఆధారంగా బ్యాపనహళ్లి పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు
చేశారు.
డబ్బుల కోసం తన అల్లుడు తన కూతురిని హత్య చేశాడని షబానా
తల్లి పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పాషా షబానా బంగారు
ఆభరణాలన్నీ తీసుకున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నాడని, ఈ
విషయంపైనే ఇరువురి మధ్య ఘర్షణలు చెలరేగుతూ వస్తున్నాయని ఆమె ఫిర్యాదు
చేసినట్లు తెలుస్తోంది.
షబానా తల్లిని ప్రశ్నించిన తర్వాత కేసును
వరకట్నం వేధింపుల కేసు కిందికి మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తమ
ఇంట్లో ఉరివేసుకుని తన భార్య షబానా మరణించిందని పాషా పోలీసులకు చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి