తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొత్త కథ
వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని
కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు
అంటున్న నేపథ్యంలోనే కెసిఆర్ ఓ పవర్ఫుల్ స్టోరీని ముందుకు తెచ్చారు.
హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే ఓ టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పిడికెడు
మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని,
అసైన్డ్, అక్రమ భూములను కలిగి ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు
అడ్డం పడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదును సమస్యగా చూపడం పెట్టుబడులు
పెట్టడం వల్ల కాదని, అక్రమాస్తుల వల్లనే అని ఆయన అన్నారు. చట్టబద్దమై
ఆస్తుల విషయంలో సమస్య ఉండదని, అక్రమాస్తులను కలిగి ఉన్నందునే తెలంగాణ
రాష్ట్రం ఏర్పడితే సమస్య వస్తుందని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
హైదరాబాదు
లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము అంగీకరించబోమని కెసిఆర్ అన్నారు.
హైదరాబాదు రాజధానిగా తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర
విభజన తప్పదని ఆయన అన్నారు. రాయల తెలంగాణవంటి పిచ్చి ప్రతిపాదనలతో తెలంగాణ
ప్రజలు అయోమయానికి గురి కావద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
తప్పదని ఆయన అన్నారు.
కాగా, హైదరాబాదు చట్టుపక్కల ఉన్న అక్రమాస్తుల
కారణంగానే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
వ్యతిరేకిస్తున్నారనే కెసిఆర్ మాటలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాదులోని,
హైదరాబాదు పరిసరాల్లోని భూములకు విపరీతంగా గిరాకీ ఉంటూ వస్తోంది. ల్యాండ్
సెటిల్మెంట్ వ్యవహారాలు కూడా భారీగానే జరిగాయి. మద్దెలచెర్వు సూరి హత్య
కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఉదంతం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
2 కామెంట్లు:
this is not story. this is 100% real
yes. now KCR is in correct way. Keep it up
కామెంట్‌ను పోస్ట్ చేయండి