స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ 'నా పాత్ర ప్రాముఖ్యం తగ్గింది' అని
బాధపడడం అనవసరం. పేరున్న హీరో సినిమాలో అవకాశం దక్కడం అనుకొన్నంత సులభం
కాదు ''అంటూ రీసెంట్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది తాప్సి. ఇది విన్న వారు
రవితేజ సినిమా 'దరవు'లో ఆమె పాత్ర నిడివి బాగా తక్కువ ఉందనే కామెంట్ లకు
ఇది సమాధానం అని అనుకుంటున్నారు. ఆమె సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద
డిజాస్టర్స్ అవుతున్న నేపధ్యంలో ఆమె 'దరవు'పై ఆశలు పెట్టుకుంది. అయితే అదీ
ఆమెకు నిరాసపరిచింది.
అలాగే హీరోయిన్ గా మాకు గుర్తింపు తీసుకొచ్చేవి పెద్ద హీరోల సినిమాలే అని నమ్ముతాను. జనాదరణ పొందిన సినిమాలో పాత్ర నిడివి తక్కువైనా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. కొన్నిసార్లు మన స్థాయి, ప్రతిభ చూపించే అవకాశం ఇలాంటి సినిమాల్లోనూ వస్తుంది. పేరున్న దర్శకుల సినిమా అంటే కథ ఏమిటి? అని కూడా అడగవలసిన అవసరం లేదు అంది.
ప్రస్తుతం 'షాడో', 'గుండెల్లో గోదారి' సినిమాల్లో నటిస్తోంది.
అలాగే
హిందీలోనూ సిద్దార్ద సరసన నటిస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక
'ఝుమ్మంది నాదం'లో నన్ను అందంగా చూపించారు కాబట్టే నాయికగా ఆ తరవాత
అవకాశాలు అందుకోగలిగాను. ఆ తరవాత అన్నీ వాణిజ్యపరమైన సినిమాల్లోనే
నటించాను. వీటి మధ్య 'గుండెల్లో గోదారి' ప్రత్యేకంగా నిలుస్తుంది. మణిరత్నం
దర్శకత్వంలో నటించాలనేది నా జీవిత ఆశయం. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి
అంది.
అలాగే ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాలన్నీ నాకు నచ్చే
చేశాను. అవి ప్రేక్షకులకు నచ్చాయా..లేదా అనేది వేరే విషయం. ఎందుకంటే నా
గదిలో కూర్చుని ప్రేక్షకులందరి ఆలోచనల్ని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఎక్కువ
మందికి చేరువైందా..లేదా..అనే విషయాలను పట్టించుకొంటే చాలు అని
శెలవిచ్చింది. తాప్సీ ప్రస్తుతం గోపీచంద్ తో మరో చిత్రం చేస్తోంది.
గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ లో మొగడు చిత్రం డిజాస్టర్ అయిన సంగతి
తెలిసిందే. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే
హీరోయిన్ గా ఎంపిక చేసారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి