ఎస్.ఎస్.రాజమౌళి
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఈగ'. ఈ నెల ఆరవ తేదీన విడుదలకు
సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ భారీగా చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన
మాట్లాడుతూ... మా నాన్నగారు ఎప్పుడో పదిహేనేళ్లు క్రితం ఓ జోక్ గా చెప్పిన
ఐడియా ఈగ. అప్పుడు నేను మర్చిపోయాను. దీన్ని పెద్ద తెరమీదకు
తీసుకువచ్చేంతవరకూ నాకు ఈ విషయం గుర్తే లేదు. నా కళ్ళ ఎదురుగా నా జ్ఞాపకంలో
ఉన్న ఆలోచన తెరకెక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అన్నారు.
ఈగ
చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...చీమ - ఏనుగూ
మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం
జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే
రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ
కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై
పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ'
సినిమా చూడాల్సిందే.
అలాగే "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి
చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే
కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా
నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు.'ఓ
దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా
చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ
పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట
వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
'ఓ
దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా
చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ
పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట
వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్
ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర
కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్ బాబు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి