అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి
జయంతిని ఎన్నారైలు వినూత్నంగా జరిపారు. ప్రజల నాడి మీద డాక్టర్ వేలు అనే
శీర్షికతో వారు ఈ జయంతిని నిర్వహించారు. వైయస్ ఫ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ
జయంతి కార్యక్రమం జరిగింది. హెలికాప్టర్‌లో ఈ జయంతి వేడుకలను జులై 8వ తేదీన
జరిపారు.
వైయస్ ఫ్యాన్ క్లబ్ అమెరికా అధ్యక్షుడు నంద్యాల వీరా
రెడ్డి, సలహాదారు నగేష్, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి, కందుల
శ్రీనివాస రెడ్డి, వీరబాబు అంబటి కోస్టా మెసా నుంచి ఎ - స్టార్
హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఆకాశమే హద్దు అనే నానుడిని గట్టిగా నమ్మే తాము
వైయస్ రాజశేఖర రెడ్డి 63వ జయంతి వేడుకలను హెలికాప్టర్‌లో ఆకాశంలోని
జరుపుకున్నట్లు వారు తెలిపారు. డాక్టర్ ప్రేమ్ రెడ్డికి చెందిన హెలికాప్టర్
న్యూపోర్ట్ బీచ్ హౌస్ వద్ద వేయి అడుగుల ఎత్తుకు చేరుకోగానే వైయస్
అభిమానులు హర్షధ్వానాలు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి గౌరవార్థం
అమెరికాలోని వైయస్సార్ హౌస్ మీద భారీ కేక్‌ను కట్ చేశారు. వైయస్ రాజశేఖర
రెడ్డి క్లాస్‌మేట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి వైయస్సార్ హౌస్ నుంచి బయలుదేరిన
హెలికాప్టర్ హాలీవుడ్ హిల్స్, సీపోర్ట్, లా డౌన్‌టౌన్‌ల మీదుగా
ప్రయాణించింది. వైయస్సార్ అభిమాని వీర అంబటి ఛాయాచిత్రాలు చేసి వైయస్సార్
జయంతి వేడుకను రికార్డు చేశారు.
2 కామెంట్‌లు:
pichi veyyi rakalu ante..ede..
looks like lot of people made money and taken it to america at that time.
కామెంట్‌ను పోస్ట్ చేయండి