4 జులై, 2012

ఎమ్.ఎస్ రాజు 'తూనీగ తూనీగ' స్టోరీ లైన్

















ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన 'తూనీగా తూనీగ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హీరో,హీరోయిన్స్ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరి మధ్య మంచి నీళ్లు ఉన్నా కూడా పెట్రోలై మండుతుంది. 'నువ్వెంత అంటే నువ్వెంత' అనుకొంటూ పోట్లాడుకోవల్సిందే. ఒకరిని ఓడించడానికి మరొకరు ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది ఇద్దరూ ఒక చోట కలిసుండాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్దవారి కోసం స్నేహం నటించాల్సి వస్తుంది. అప్పుడేం చేశారు? కొత్తగా వచ్చిన పిలుపులు, పలకరింపులు... వారి మధ్య ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి అనేది మిగతా కథ.

నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్‌.రాజు. దిల్‌రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్‌ పతాకంపై మాగంటి రామచంద్రన్‌ (రాంజీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించారు. రియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని, ఏడాదిలో టాప్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుందనే అభిప్రాయాన్ని ఎమ్.ఎస్ రాజు వ్యక్తం చేశారు. కార్తీకరాజా సంగీతానికి మంచి స్పందన లభించిందన్నారు.

చిత్ర సమర్పకుడు దిల్‌ రాజు మాట్లాడుతూ...మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా పూర్తయిన తరవాత ఎందుకో ఆ సినిమాపై నాకే కొన్ని సందేహాలు వచ్చాయి. వెంటనే ఎమ్మెస్‌ రాజుకి చూపించాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. దాంతో.. సినిమా బాగా వచ్చింది. 'తూనీగ తూనీగ'కూ అలాంటి సమస్యే ఎదురైంది. నాకు ఈ సినిమా చూపించినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. ఈ మధ్యలోనే కాస్త లోటు అనిపించింది. ఆ సంగతే చెబితే, మళ్లీ ఓ వారం షూటింగ్ చేసి చూపించారు. అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది అన్నారు.

అలాగే సుమంత్ అశ్విన్ అనుభవం ఉన్న హీరోలా చాలా ఈజ్‌తో చేశాడు. వెంకటేశ్, అల్లు అర్జున్ తర్వాత ఓ నిర్మాత కొడుకుగా సుమంత్ అశ్విన్ హీరోగా సెటిల్ అవుతాడు. నేను చెప్పింది నిజమని సినిమా విడుదలైన రోజు ప్రేక్షకులు ఏకీభవిస్తారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్టయ్యాయి. కొడుకును పరిచయం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెస్ రాజు రెట్టింపు కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యాక మా బేనర్‌లోనే అశ్విన్‌తో రెండో సినిమా చేస్తాం'' అని చెప్పారు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు.

కామెంట్‌లు లేవు: