అల్లరి నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ సంస్థ
నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ
ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. శ్రీమతి అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో చంటి అడ్డాల
నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయిక. షూటింగ్ వివరాలను నిర్మాత
చంటి తెలియజేస్తూ..ఈ నెల 9న షెడ్యూల్ ప్రారంభించాం. 28 వరకూ రామోజీ
ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్ జరుగుతుంది. ముందే చెప్పినట్లుగా ఈ సినిమా కోసం
యముని ఇంటి సెట్, దర్బార్ సెట్, బృందావనం...ఇలా 11 భారీ సెట్లు వేసి,
వాటిల్లో షూటింగ్ చేస్తున్నాం. రెండు పాటలను కూడా ఈ సెట్స్ లో
చిత్రీకరించాం. ఈ షెడ్యూల్‌తో సెట్స్ వర్క్, వాటికి సంబంధించిన గ్రాఫిక్
వర్క్ పూర్తవుతాయి. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు కోటి అద్భుతమైన బాణీలు
అందించారు. ఆయన స్వర పరిచిన ఐదు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి
అన్నారు.
ఆగస్టు షెడ్యూల్లో పాలకొల్లు, పరిసర ప్రాంతాల్లో షూటింగ్
జరుగుతుందని , ఆ నెలాఖరు వరకు జరిగే షూటింగుతో రెండు పాటలు మినహా చిత్రం
పూర్తవుతుందని తెలిపారు. గోదావరి నది మధ్యలో ఓ భారీ సెట్ వేసి ఐటం సాంగ్
చిత్రీకరిస్తామని నిర్మాత వెల్లడించారు. మిగిలిన రెండు పాటల్లో ఒకటి
హైదరాబాద్ లో, మరొకటి విదేశాల్లో చిత్రీకరించడంతో షూటింగ్ పార్టు
పూర్తవుతుందని తెలిపారు.
నరేష్ చిత్రాల్లో ఇది భారీ చిత్రంగా
నిలుస్తుందని, కథ డిమాండ్ మేరకు భారీగా ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం.
మేకింగ్ విషయంలోగానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ రాజీపడటం లేదు. ఏదో హడావుడిగా
సినిమా పూర్తి చేసి విడుదల చేయాలనే దృక్ఫథంతో కాకుండా సంతృప్తి కరంగా
సినిమా వచ్చిందనకున్న తరువాతే విడుదల చేస్తాం. సరికొత్త కథ, కథనాలతో
రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే
నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
దర్శకుడు ఇ. సత్తిబాబు
మాట్లాడుతూ...ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ
నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని
చెప్పారు. సినియర్ నరేష్, గిరబాబు, చంద్రమోహన్, తనకెళ్ల భరణి, ఏవీఎస్,
చలపతిరావు, రఘుబాబు, కృష్ణ భగవాన్, భరత్, సుధ, సత్యకృష్ణ, హేమ, సన, రజిత,
చిట్టిబాబు, పృథ్వీ, సారిక రామచంద్రరావు ఇతర ముఖ్య తారాగణం. కథ : జయసిద్ధు,
మాటలు : క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం : కోటి, ఛాయా గ్రహణం : కె.
వీరేంద్రబాబు, ఎడిటింగ్ : గౌతంరాజు, కళ : కిరణ్ కుమార్, నిర్మాత : చంటి
అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఇ. సత్తిబాబు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి