పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా
పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో
రాంబాబు'. ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచీ బిజినెస్ వర్గాల్లో విపరీతమైన
క్రేజ్ ఏర్పడింది. అందులోనూ గబ్బర్ సింగ్ చిత్రం యాభై రోజులకే అరవై మూడు
కోట్లు వసూలు చేయటంతో ఆ ఎఫెక్టు ఈ తాజా చిత్రంపై పడనుంది. ఈ నేఫద్యంలో
'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ
బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి
సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్
మీడియా జర్నిలిస్టు గా కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజం
కాదని తెలిసింది. పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారు.
తెలిసిన
సమాచారం ప్రకారం హీరోయిన్ తమన్నా ..గంగగా మీడియాకు చెందిన వ్యక్తిగా
కనిపిస్తుంది. ఆమె మెకానిక్ గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే
రిపేర్స్ చేయిస్తుంది. మెకానిక్ గా ఉండే అతను కెమెరా తో సమాజంలోని కొన్ని
దారుణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి అవకతవకలను సరిచేస్తాడని
చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర పవన్ కెరీల్ లో ఓ కొత్త యాంగిల్ లో మాస్ కి
పట్టేలా ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఐటం
సాంగ్ ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం యాసలో హుషారుగా
సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. లండన్‌కి చెందిన
స్కార్లెట్ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్ గీతం చేసింది. ఇటీవలే
రామ్‌చరణ్ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు
సమకూర్చారు.
నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ
రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న
గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి