చెన్నై: తన కారులో లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయిని బలవంతంగా కౌగిలించుకొని,
కిస్ చేసినందుకు ఓ యువకుడిని తమిళనాడులోని అద్యార్ పోలీసులు అరెస్టు
చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాషర్‌మెన్‌పేటకు చెందిన ఇరవై
రెండేళ్ల కాలేజ్ అమ్మాయి రెండు రోజుల క్రితం కొత్తగా కొన్న తన కారులో
వెళుతుండగా కస్తూరిబాయి నగర్‌లోని థర్డ్ క్రాస్ వీధి వద్దకు వచ్చేసరికి
పెట్రోల్ అయిపోయింది.
దీంతో కారు ఆగిపోయింది. కారు స్టార్ట్
అవుతుందేమోనని ఆమె ప్రయత్నించింది. పక్కనే నిలబడిన ఇరవై నాలుగేళ్ల రాజ
మోహన్ ఆమె కారును స్టార్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాడు.
ఇతనో క్యాబ్ డ్రైవర్. ఏదైనా సహాయం కావాలా అని అమ్మాయిని అడిగాడు. ఆయన
మాటలను నమ్మిన ఆ అమ్మాయి కారులో పెట్రోల్ అయిపోయిందని, పోయించడానికి
దగ్గరలో బంక్ లేదని చెప్పింది.
తాను వెళ్లి తీసుకు వస్తానని చెప్పిన
రాజ మోహన్ దగ్గరలో ఉన్న బంక్ వద్దకు వెళ్లి ఓ బాటిల్‌లో పెట్రోల్ తీసుకు
వచ్చాడు. ఆమె కారులో పెట్రోల్ పోసిన అనంతరం తన కారును ఇక్కడే దగ్గరలో
పార్క్ చేశానని, అక్కడ వరకు తనకు లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఆ అమ్మాయిని
కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. అతను కారులోని వెనుక సీట్లో
కూర్చున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న రాజ మోహన్ హఠాత్తుగా తనను వెనుక
నుండి కౌగిలించుకొని తనపై ముద్దుల వర్షం కురిపించాడని ఆమె తన ఫిర్యాదులో
పేర్కొంది.
రాజ మోహన్ చర్యలతో నిశ్చేష్టురాలైన అమ్మాయి ఒక్కసారిగా
అరవడం ప్రారంభించింది. ఇది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి
అద్యార్ పోలీసులకు అప్పగించారు. బాధిత అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు
కేసు నమోదు చేసుకొని రాజ మోహన్‌ను అరెస్టు చేశారు. ఇతనిని జ్యూడిషియల్
రిమాండుకు పంపించారు. ఇతను తిరువూర్‌కు చెందిన వ్యక్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి