హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చాపర్ మిస్సయ్యే
సమయానికి అదిలాబాద్ జిల్లా శాసనసభ్యుడు ఒకరు తన ఇంట్లోనే ఉన్నారని, ఆయన
మసాజ్ చేయించుకుంటున్నారని సెక్స్ రాకెట్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న తారా
చౌదరి మంగళవారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. తాను
తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిని కేవలం టీవిలో మాత్రమే చూశానని, జోగు
రామన్న ఎవరో తనకు తెలియదని చెప్పారు.
ఆమె మంగళవారం పలువురి ఫోన్
ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కొంతమంది తానెవరో తెలియదని చెబుతున్నారని, అలా
అయితే వారి వ్యక్తిగత మొబైల్ నుంచి, ఇంకా అనేక ఫోన్ల నుంచి తనకు ఫోన్లు
ఎందుకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. అందుకు సంబంధించిన కాల్ లిస్టును ఆమె
చూపించారు. తాను చెప్పేది అబద్దమైతే ఈ కాల్స్ వచ్చాయో లేదో సిఐడి విచారణ
జరిపించాలని సూచించారు.
చాలామంది తనను అడ్డు పెట్టుకొని వారి అవసరాలు
తీర్చుకున్నారని ఆమె ఆరోపించారు. వారి బాధలు భరించలేక రెండు, మూడుసార్లు
ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని, కాంగ్రెసు ప్రభుత్వంపై తనకు
నమ్మకముందని చెప్పారు. తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
కేవలం తనకు ప్రాణ రక్షణ కోసమే కొంతమంది ఫోన్ చేసినప్పుడు కాల్స్ రికార్డ్
చేశానని చెప్పారు.
అంతే తప్ప ఎవరినీ బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యం
తనకు లేదన్నారు. ఒక ఆడపిల్ల సినిమా రంగానికి వస్తే ఎన్ని ఇబ్బందులు
ఎదురవుతాయో అందరికీ తెలియాలనే ఈ విషయాలను వెల్లడిస్తున్నానని చెప్పారు.
కాగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లిన
అదిలాబాద్ ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు తనను,
తన కుటుంబాన్ని వేధించారని తారా చౌదరి చెప్పిన విషయం తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి