6 ఫిబ్ర, 2012

టాప్ 10 వాంఛనీయ పురుషులు: మహేష్ బాబు తర్వాతే ధోనీ, షారుక్


"టైమ్స్" ప్రతి ఏడాది చేపట్టే "టాప్ 50 వాంఛనీయ పురుషులు" పోల్‌లో అనూహ్యంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఐదవ స్థానాన్ని ఆక్రమించేశాడు. మహేష్ బాబు తర్వాత టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్ ధోనీ, ఆ తర్వాత షారుక్ ఖాన్ ఉండటం గమనార్హం. 

ఇక పోతే మొదటి స్థానాన్ని బాలీవుడ్ కండలవీరుడు షారుక్ ఖాన్ ఆక్రమించాడు. రెండో స్థానంలో రణబీర్, మూడోస్థానం హృతిక్ రోషన్, నాలుగో స్థానంలో జాన్ అబ్రహాంలున్నారు. 

మొత్తమ్మీద మహేష్ బాబు 'దూకుడు', 'బిజినెస్మేన్' చిత్రాలతో తన రేంజ్‌ను, స్టామినాను నిరూపించుకున్నాడు. ఇకపోతే టాప్ 50లో మన తెలుగు సెలబ్రిటీలు ఎవరున్నారయా అని చూస్తే... 20వ స్థానంలో రానా దగ్గుబాటి ఒక్కడే తేలాడు.

కామెంట్‌లు లేవు: