తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో చోటు చేసుకుంది.
తేని జిల్లా దేవారాం దక్షిణ వీధికి చెందిన బోస్ అనే వ్యక్తి కుమారుడు శక్తీశ్వరన్ అనే యువకుడు చెన్నయ్‌లో పని చేస్తున్నాడు. శక్తివేల్‌కు తూత్తుక్కుడికి చెందిన చంద్రవేల్ కుమార్ ఉమాకు ఈనెల ఆరో తేదీన వివాహమైంది. ఈ వివాహం తర్వాత మర్లు పెళ్లికి వెళ్లి మళ్లీ పెళ్లి కుమారుని ఇంటికి వ్యానులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో 13 మంది మహీంద్రా టూరిస్టర్ వ్యానులో తూత్తుక్కుకుడి నుంచి తేనికి బయలుదేరారు. ఈ వ్యాను మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని నిలక్కోట్టై వద్ద వేగంగా వస్తున్న వ్యాను డ్రైవర్ స్పీడర్ ఉన్న విషయాన్ని గుర్తించలేదు.
దీంతో అమితవేగంతో స్పీడ్ బ్రేకర్‌ను దాటిన వెంటనే వ్యాను అదుపుతప్పి పక్కనే ఉన్న 60 అడుగుల లోతులో ఉన్న బావిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిని విరుదునగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలను కూడా పోలీసులు సేకరించి, మృతదేహాలను గుర్తించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి