ఎమ్మార్, జగన్ ఆస్తుల కేసు, ఓబుళాపురం అక్రమ గనుల కేసులు రాష్ట్రంలోని పెద్ద తలకాయలకు చుట్టుకునేటట్లుగానే ఉన్నాయి. 2జీ కేసులో, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ కుంభకోణం.. ఇత్యాది కేసులన్నింటిలోనూ ఎదురుకాని వింతపరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతోంది.
రాష్ట్రంలో సీబీఐ వివిధ కేసులపై ఇప్పటివరకూ సుమారు 15 మంది ఐఏఎస్ అధికారులను విచారించింది. నలుగురు అధికారులను జైలుకు కూడా పంపింది. ఇంకా ఈ చిట్టా పెద్దదయ్యే ఛాన్స్ ఉందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. ఈ భయంతోనో ఏమో ఐఏఎస్ అధికారుల సంఘం తమ సహచరులను సీబీఐ వేధిస్తోందంటూ నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు.
ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ అరెస్టు చేసిన అధికారులకు నిజం తెలిసినా రాజకీయ నాయకుల అక్రమాల గుట్టును విప్పడం లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో చేసిన తప్పుకు తమను వేధిస్తున్నారంటూ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమై కూచుంది.
తప్పు చేసిన వారెవరో చెప్పేస్తే వారిని సీబీఐ వదిలేస్తుంది కదా.. అనే మాటలు వినబడుతున్నాయి. పైపెచ్చు ఇపుడు రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులే అధికారులు నిజం చెప్పేయాలంటూ అడుగుతున్నారు. వీరిలో వైద్యఆరోగ్య శాఖామంత్రి డీఎల్ ఉన్నారు. ఆయనతోపాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఉన్నారు.
నిజం చెబితే, అక్రమాలకు పాల్పడిన వారి వివరం తెలుస్తుందంటున్నారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోదరుడు ఆనం వివేకా అయితే, అధికారులు తప్పును కప్పి పుచ్చుకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాలని సూచిస్తున్నారు. మరి ఇంతమంది చెప్పేయమని అడుగుతున్న నేపధ్యంలో ఐఏఎస్‌లో అసలు రాజకీయ దొంగలు ఎవరో చెప్పేస్తారా..? ఒకవేళ అలా చెప్పేస్తే నాయకులను జైళ్లలో పెడతారా..? అసలేం జరుగుతుందో చూడాల్సిందే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి