9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి చదువులు చెప్పే ఉపాధ్యాయురాలిని కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్యారిస్‌లో ఆర్మేనియన్ వీధిలో గల సెయింట్ మేరీస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూలులో ఈ దారుణం జరిగింది.
విద్యార్థికి మార్కులు తక్కువ రావడంతో సైన్స్ టీచర్ ఉమా మహేశ్వరి (42).. తొమ్మిదో తరగతి చదువుతున్న ముహ్మద్ ఇర్ఫాన్ (15) అనే విద్యార్థిని తిట్టడంతో ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.
గురువారం ఒంటరిగా వేరొక తరగతి గదిలో ఉన్న ఉమా మహేశ్వరిపై ఇర్ఫాన్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఉమా మహేశ్వరి మెడకు కత్తి బలంగా తగలి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ చదువుల్లో వెనుకబడి ఉన్నాడని, ఈ విషయాన్ని ఆతడి తల్లిదండ్రులకు తెలియజేస్తానని ఉమా మహేశ్వరి హెచ్చరించడంతోనే మహ్మద్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి