2 ఫిబ్ర, 2012

150 రోజులు ముగిసిన గాలి జైలు జీవితం

కర్నాటక రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వాన్నే గడగడలాడించిన మైనింగ్‌ మాంత్రికుడు గాలిజనార్థన్‌రెడ్డి జైలు జీవితం నేటితో సరిగ్గా 150రోజులు గడిచింది. నిత్యం పట్టుపాన్పులపై నిద్రించే ఆయన కటిక నేలపై నిద్రిస్తూ నేడు జైలులో పూజలు, పునస్కారాలు అంటూ దైవ భక్తుడిగా మారిపోయాడు. ఎవ్వరూ పలకరించిన కనీసం నోరు సైతం మెదపని గాలి ప్రస్తుతం రామకోటితో జైలు జీవితం గడిపేస్తున్నాడు.

మైనింగ్‌ మాంత్రికుడు గాలిజనార్థన్‌రెడ్డి జైలు జీవితం నేటితో సరిగ్గా 150రోజులు గడిచింది. సిబిఐ చేపట్టిన దర్యాప్తులో అక్రమ మైనింగ్‌ వ్యవహారాలకు సంబంధించి గాలి జనార్థన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో తన జీవితం గడుపుతున్నాడు. పట్టుపాన్పులు, బంగారు పల్యాల్లో భోజనం చేసిన ఆయన నేడు అల్పాహారాలతో కాలం గడుపుతున్నాడు.

కర్నాటక రాజకీయాలను తన కనుసన్నల్లో పెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రధాన నేతలను గడగడలాడించిన గాలి జనార్థన్‌ రెడ్డి పవర్‌ సిబిఐ ముందు ఏ మాత్రం పనిచేయ లేక పోయింది. మొదట్లో జైలులో భోజనం చేయడానికే ఇబ్బంది పడ్డ గాలి ప్రస్తుతం జైలు జీవితానికి అలవాటు పడ్డాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవభక్తిలో ఆయన మునిగిపోతున్నారు.

నాలుగుసార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. న్యాయమూర్తి ముందు తాను దేశం విడిచి వెళ్లబోనని విన్నవించుకున్నా బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి సమ్మతించకపోవడంతో పుట్టినరోజు సైతం జైలులోనే చేసుకోవాల్సి వచ్చింది. మరో పక్కన కర్నాటక ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు తన కుటుంబ సభ్యులను సైతం జైలుకి రాకుండా కట్టడి చేశారు.

కేవలం ఒక్క న్యాయవాదితో మినహా తోటి ఖైదీ శ్రీనివాస్‌రెడ్డితో కూడా మాట్లాడే అవకాశం లేకుండా అధికారులు చేశారు. తనకు బెయిల్ రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటున్నా న్యాయమూర్తి స్పందించలేదు. ఇంకా ఎన్ని రోజులు జైలు జీవితాన్ని గడపాల్సి వుంటుందో వేచి చూడాల్సిందే..

కామెంట్‌లు లేవు: