మీరు చేసే పనిలో విజయం సాధించాలంటే మీలోని ఆత్మ విశ్వాసమే మీకు తారకమంత్రంగా చెప్పుకోవచ్చు. చేసే పనిలో విజయం సాధించాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా విజయం మీ సొంతమే అవుతుందని మానసికవైద్య నిపుణులు అభిప్రాయపడుతన్నారు. అయితే, ఒకరి సామర్థ్యంపై వారికి తగినంత విశ్వాసం ఉండదు. ఇలాంటి వారు జీవితంలో ఏ పని సక్రమంగా చెయ్యలేరని చెప్పొచ్చు.
అలాగే, అమాయకత్వాన్ని మించిన అజ్ఞానం లేదు. ఆసక్తికరమైన అంశాల పట్ల మరింత అవగాహన పెంచుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం మెరుగవుతుంది. ఎంత ఎక్కువ విషయ పరిజ్ఞానం పెంపొందించుకుంటే అంత ఎక్కువ ఆత్మ విశ్వాసంతో ఉండవచ్చు. ఆసక్తికర అంశాల పట్ల పూర్తి అవగాహన పెంచే పుస్తకాలు చదవడం, అంతర్జాలంలో ఉన్న సమాచారాన్ని సేకరించడం ఇందుకు చాలా ఉపకరిస్తుంది.
ఎంత నిజాయతీగా ఎవరిని వారు అంచనా వేసుకోగలిగితే అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఎవరి గురించి వారే. అంటే మీలో గొప్ప విషయాలేమిటి, మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే అవగాహన ఉంటే నలుగురిలో మరింత ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించగలుగుతారని వారు చెపుతున్నారు.
ముఖ్యంగా, ఏదైనా క్లిష్ట సమస్య ఎదురైనపుడు బెంబేలెత్తిపోకుండా, దాన్ని కూలంకషంగా విశ్లేషించడం ద్వారా పరిష్కారం వైపు అడుగులు వేయవచ్చు. సమస్యను పరిష్కరించే క్రమంలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలు బయటికి వస్తాయి. మనలోని నైపుణ్యాలు ఏమిటో తెలిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మలచుకోవచ్చని వారు సలహా ఇస్తున్నా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి