17 ఫిబ్ర, 2012

రాజీవ్ హత్య కేసులో అమెరికాకు సంబంధం : శ్రీలంక మంత్రి

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో అమెరికాకు సంబంధం లేకుండా ఉండదని శ్రీలంక మంత్రి ఒకరు తాజాగా ఆరోపించారు. రాజీవ్‌ను తమిళనాడులోని ఎల్టీటీఈ తీవ్రవాదులతో అమెరికా రహస్య ఒప్పందం కుదుర్చుకుని హత్య చేసి ఉంటారని, ఈ విషయం ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు కూడా తెలిసి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.

దీనిపై అమెరికా గృహ నిర్మాణ శాఖామంత్రి విమల్ వీరవన్‌ కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజీవ్‌ను హత్య చేస్తే ఎల్టీటీఈ సంస్థకు ఉత్పన్నయ్యే సమస్యలు, ప్రమాదం గురించి ప్రభాకరన్‌కు గ్రహించకుండా ఉండరని, అలా ప్రమాదం పొంచివున్న సమయంలోనూ ప్రభాకరన్ రాజీవ్‌ను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చే అమాయకుడు కాదన్నారు. ప్రభాకరన్‌కు తెలియకుండానే తమిళనాడులోని ఎల్టీటీఈ తీవ్రవాదులతో అమెరికా చేతులు కలిపి హత్య చేసి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. 

ఇందిరా గాంధీ కుటుంబం మరింత బలపడితే దక్షిణాసియాలో అమెరికా ఆర్థికపరంగా నిలదొక్కుకోలేమని గ్రహించడం వల్లే అమెరికా ఈ తరహా చర్యలకు దిగి ఉంటుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 21 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్యకు ఎలాంటి ఆధారం లేదని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు: