ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేధిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రా రెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ కడప జిల్లా కార్యకర్తల సమావేశానికి డుమ్మా కొట్టారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ కడపకు రావడానికి భయపడుతున్నారని మంత్రి డిఎల్. రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ... కడప జిల్లాలో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంకా తన పార్టీ కార్యకర్తలను కూడా కడప జిల్లా ప్రచారానికి పిలుపునిచ్చారు.
అధికార దాహంతోనే ప్రస్తుత వైయస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత కడప ఎమ్‌పి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడారని ముఖ్యమంత్రి విమర్శించారు. అయితే జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి