బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు, ఒక్క ప్రతిపక్షాన్నే కాదు.. కాంగ్రెస్‌ను కూడా ఆగ్రహాన్ని తెప్పించాయి. బాట్లా ఉదంతం ఫోటోలను చూస్తున్న సమయంలో సోనియా కంట కన్నీరొలికిందంటూ ఆయన చెప్పిన మాటలే పార్టీ ఆగ్రహానికి కారణం. ఖుర్షీద్ పిచ్చి వ్యాఖ్యలు చేసి పార్టీ అధినేత్రిని వివాదంలోకి లాగారని పార్టీ నాయకత్వం భావిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖుర్షీద్, ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, తాను బాట్లా హౌస్ ఉదంతం నాటికి మంత్రిగా లేనని, అయితే, ఈ సంఘటన గురించి సోనియా దృష్టికి తీసుకెళ్లగా, ఆమె ఆ ఫోటోలను చూస్తూ కళ్లలో నీరు పెట్టుకున్నారని చెప్పారు. దయచేసి నాకు ఈ పోటోలు చూపించకండి అంటూ ఆమె తనను కోరినట్లు కూడా ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో, ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఈ వివాదాస్పద ఎన్‌కౌంటర్ ప్రస్తావన తెచ్చేందుకు ప్రయత్నించిన ఆయన, ఆ తర్వాత వెల్లువెత్తిన విమర్శలను చూసి వెనక్కుతగ్గారు. సోనియా కన్నీరు పెట్టుకున్నారని చెప్పలేదని, ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారని మాత్రమే చెప్పానని స్పష్టం చేసారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి