18 ఫిబ్ర, 2012

వరకట్న చెల్లింపునకు దోపిడీకి దిగిన ఎంబిఎ అమ్మాయి

హైదరాబాద్: పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో వరకట్నం చెల్లింపు కోసం ఓ అమ్మాయి దోపిడీకి దిగింది. ఆమె మామూలు అమ్మాయేం కాదు, ఎంబిఎ విద్యార్థిని. హైదరాబాదులోని కుషాయిగుడాలో శుక్రవారం తన తల్లితో కలిసి ఆ అమ్మాయి ఓ గృహిణి బంగారు గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించింది. 

తల్లి రమాదేవి, కూతురు శారద ఎపిఐఐసి కాలనీలోని కల్పన అనే గృహిణి ఇంట్లోకి చొరబడ్డారు. ముసుగులు కప్పుకున్న వారిద్దరు కల్పనను కింద పడేసి ఆమె గొలుసును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. కల్పన పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఆ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. 

శారద కుషాయిగుడాలోని సాయి సుధీర్ కళాశాలలో ఎంబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పెళ్లి కుమారుడి కుటుంబానికి శారద కుటుంబ సభ్యులు లక్ష రూపాయల వరకట్నం ఇవ్వాల్సి ఉంది. మార్చి 8వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. కల్పన ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని తల్లీకూతుళ్లు ఈ దోపిడీ యత్నానికి దిగారు. నిందితులు ఇంతకు ముందు కల్పన ఇంటి పక్కనే ఉండేవారు. ఇప్పుడు కమలాపురిలో ఉంటున్నారు.

2 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

చాలా బాధా కరం.. ఆ అమ్మాయిని కాదు ఆ అమ్మయిని పెళ్లి చేసుకోవటానికి వరకట్నం అడిగిన వారిని జైలులో వేయాలి....విచిత్రం ఏమిటి అంటే తల్లులకి తెలుసు పెళ్ళికి కట్నం ఇవటానికి ఎన్ని కష్టాలు పడుతారో అయిన కూడా తన కొడుకులకు కట్నం అడుగుతారు

Simham చెప్పారు...

ఆహా.. సమస్య మూలాలకు పోతున్నారా ?.. తల్లి దండ్రులు తమని విడిచి వెళ్ళే పిల్లలకు తమ వంతుగా కొంత సొమ్ము ఇవ్వటం లో తప్పేం ఉంది.. ?

అయినా.. ఎంబీఏ వంటి చదువు స్టాండర్డ్స్ కూడా ఇలా ఉన్నాయన్నది పాయింట్ అనిపిస్తోంది నాకు.. ప్రతీ క్లాస్ లో ఒక దాదాపు ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే ఎందుకు ఆ సబ్జెక్ట్ లో పై కి వస్తుంటారు..