29 ఫిబ్ర, 2012

గాలి జనార్ధన రెడ్డి కోసం పిటి వారెంట్ దాఖలు


హైదరాబాద్: కర్ణాటకలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఓంఎసి యజమాని గాలి జనార్దన రెడ్డిని అక్కడి సిబిఐ విచారించనుంది. కర్ణాటక కోర్టులో జనార్దన రెడ్డి కోసం అక్కడి సిబిఐ పిటి వారెంట్ దాఖలు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ కేసులో ఆయనని విచారించేదుకు ఈ వారెంట్ దాఖలైంది. జనార్దన రెడ్డిని విచారణ నిమిత్తం బెంగళూరు తీసుకువెళ్లే అవకాశం ఉంది. సిబిఐ ఈ విషయాన్ని చంచల్ గూడ జైలు అధికారులకు తెలిపింది.

కామెంట్‌లు లేవు: