12 ఫిబ్ర, 2012

ప్రిన్స్ హ్యారీని ప్రాణాలతో పట్టుకుంటాం లేదా హతమార్చుతాం!!!

బ్రిటీష్ రాయల్ ప్రిన్స్ హ్యారీని ప్రాణాలతో పట్టుకోవడమా లేదా హతమార్చడం జరుగుతుందని తాలిబన్ తీవ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రిన్స్ హ్యీరీ ఇటీవల అపాచీ హెలికాఫ్టర్ పైలట్‌ శిక్షణను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. హెలికాఫ్టర్‌ పైలట్‌గా ఆప్ఘనిస్థాన్‌లో అడుగుపెడితే ఆయను పట్టుకుంటామని తాలిబన్ ప్రకటించింది. 

నాలుగు నెలల విధుల నిర్వహణ కోసం హెల్మాండ్ ప్రొవిన్స్‌లో 27 యేళ్ల ప్రిన్స్ హ్యారీ ఫ్లై మిషన్‌లో పయనించే అవకాశం ఉందని బ్రిటీష్ రక్షణ వర్గాలను ఉల్లంఘిస్తూ డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

గత 2008 సంవత్సరంలో యుద్ధభూమిగా మారిన ఆప్ఘనిస్థాన్‌లో హ్యారీ దాదాపు రెండు నెలల పాటు ఉన్నారు. అలాంటి హ్యారీని సజీవంగా పట్టుకోవడం లేదా హత్య చేయడం జరుగుతుందని తాలిబన్ ప్రకటించింది. గతంలో తాము ఈ పని చేయలేక పోయామని గుర్తు చేశారు. 

కానీ, భవిష్యత్‌లో తమ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తామని తాలిబన్ అధికార ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ తెలిపారు. హ్యారీని సజీవంగా పట్టుకుంటే ఇతర ఖైదీల తరహాలోనే తాము చూస్తామని ఆయన చెప్పారు

కామెంట్‌లు లేవు: