న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసానికి అతి సమీపంలో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు గాయపడ్డారు. ప్రధాని నివాసానికి 500 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ దౌత్యవేత్త కారును పేలుడు తాకింది. ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం ప్రధాని నివాసానికి సమీపంలో ఉంది. కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ ఇల్లు కూడా ఈ పేలుడు సంభవించిన స్థలానికి అతి సమీపంలో ఉంది.
పేలుడు గల కారణమేమిటనేది తెలియడం లేదు. పేలుడు సంభవించిన కారు ఎంబసీ కార్యలయానికి సమీపంలో ఉందని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి డేవిడ్ గోల్డ్‌ఫార్బ్ చెప్పారు. పేలుడు సోమవారం సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు సంభవించింది. గాయపడినవారిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిన ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగిని మాత్రం ఎయిమ్స్‌లో చేర్చారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి