బెంగళూరు: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌కు ఓ యువకుడి సెల్ ఫోన్ నుండి కాల్ వెళ్లడం అతనిని ఇబ్బందుల్లోకి నెట్టింది. బాధిత యువకుడు రాయచూర్ జిల్లా సింధనూర్ తాలుక రిమోట్ బుద్దిని గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సిసిబి అధికారులు బెంగళూరు నుండు వెళ్లి విచారించడంతో ఇది వెలుగు చూసింది. హీనాకు వచ్చిన కాల్‌పై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ కార్యాలయం మన ప్రభుత్వానికి తెలియజేసి విచారణ చేయాల్సిందిగా కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిసిబి అధికారులు విచారణ జరుపుతున్నారు. హీనాకు ఫోన్ చేసిన వ్యక్తి రోతగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్ సదరు యువకుడి ఫోన్ నుండి వచ్చిందని, దాదాపు 15 నిమిషాలు అతను మాట్లాడారని చెబుతున్నారు.
ఈ ఘటన రెండు నెలల క్రితం చోటు చేసుకుందన్నారు. నెల రోజుల క్రితం ఢిల్లీ నుండి సిబిఐ అధికారులు వచ్చి వెళ్లారన్నారు. ఆదివారం బెంగళూరు సిసిబి అధికారులు గ్రామానికి వెళ్లి విచారించారు. ఆ యువకుడు ఆరోపణలు ఖండిస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు సిసిబి అధికారుల నుండి ఎలాంటి పూర్తి నిర్ధారణ సమాచారం రాలేదన్నారు. బాధిత యువకుడు ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వద్ద అటెండర్‌గా పని చేస్తున్నాడు. తాను ఇప్పటి వరకు రబ్బాని ఖర్ పేరు వినలేదని, తనకు ఆమెతో మాట్లాడేందుకు ఇంగ్లీషు కానీ ఉర్దూ కానీ రాదని, అలాంటప్పుడు ఆమెకు తాను ఫోన్ చేసి ఎలా మాట్లాడతానని ఆవేదనతో చెప్పాడు. అయితే తన ఫోన్‌ను మరెవరైనా ఉపయోగించారో తనకు తెలియదన్నాడు. కాగా బాధితుడి తరఫున కోచింగ్ సెంటర్ లెక్చరర్లు కాల్ రికార్డులు చూపించమని కోరగా సిసిబి అధికారులు అందుకు నిరాకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాగా తాము మళ్లీ కాంటాక్ట్ చేసే వరకు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయకూడదని పోలీసులు బాధిత యువకుడికి సూచించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి