పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం కోకా పేటలోని ‘మర్యాద రామన్న’ సెట్‌లో జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం సందర్శించాడు. బాబాయ్‌ని కలిసేందకు అబ్బాయ్ రావడంతో యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయిన మంచి స్పందన చూరగొంది. ‘నాకు కొంచెం తిక్క ఉంది..కానీ దానికి లెక్కుంది’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులకు అభిమానులు పులకించి పోతున్నారు.
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణి వర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి, లేదా ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి