రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను మంత్రి పదవి అడగలేదు. అలాగే తన మంత్రి పదవిలో కోతపై అసంతృప్తి లేదని డీఎల్ స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి అన్నారు. మంత్రిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన శాఖ నిర్వహణకు ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.
పార్టీ శ్రేయస్సు కోసమే కడప ఎన్నికల్లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేశానని, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నానని డీఎల్ వ్యాఖ్యానించారు. శాఖ మీద అసంతృప్తితో రాజీనామా చేసే ఆలోచనలో లేదని, ఆ కఠిన నిర్ణయాన్ని విరమించుకున్నానని డీఎల్ తేల్చి చెప్పారు.
అలాగే పార్టీపై ఎవరూ విమర్శలు చేసినా నోరుమెదపక ఉండలేనని డీఎల్ తెలిపారు. మా నాన్న రెక్కల కష్టంతో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలో అధికారం చెలాయిస్తుందన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం దారుణమన్నారు. మీ నాన్న రెక్కల కష్టంతో కాదు. కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్‌కు డీఎల్ కౌంటర్ ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి