8 ఫిబ్ర, 2012

2జీ స్కామ్: దయానిధి - కళానిధి మారన్‌లపై ఈడీ కేసులు

2జీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లపై మనీలాండరింగ్ కేసులను నమోదు చేసింది. ఈ కుంభకోణంలో మలేషియన్ వ్యాపారవేత్త టి.అనంతకృష్ణన్ ద్వారా మ్యాక్సిస్ కంపెనీ నుండి రూ.550 కోట్ల ముడుపులను పెట్టుబడుల ముసుగులో సన్‌ డైరెక్ట్ టీవీకు మారన్ సోదరులు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

అక్రమార్జన సొమ్ము చలామణి నిరోధ చట్టం కింద ఈ కేసులను నమోదు చేసారు. ఈ కేసులో మ్యాక్సిస్ గ్రూపునకు చెందిన రాల్ఫ్ మార్షల్ పేరును కూడా చేర్చారు. శివశంకరన్‌కు చెందిన ఎయిర్‌సెల్ కంపెనీకి లైసెన్సులను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా మ్యాక్సిస్ కంపెనీ రూ.550 కోట్లను సన్ టీవీ, సన్ డీటీహెచ్ పెట్టుబడుల రూపంలో ముడుపులను అందచేసినట్లు కేసులో పేర్కొన్నారు.

దాంతోపాటు భారతీ సెల్యూలార్, ఒడాఫోన్ ఎస్సార్, హచీసన్ మ్యాక్స్, స్టెర్లింగ్ సెల్యూలార్‌లకు కూడా ఛార్జీలను పేర్కొంది. మార్కెట్ ధరకన్నా తక్కువగా టెలీకామ్ శాఖ మాజీ కార్యదర్శి శ్యామల్ ఘోష్, డాట్ అధికారి జె.ఆర్.గుప్తాలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: