6 ఫిబ్ర, 2012

బాలకృష్ణ సీఎం అయ్యాక "నర్తనశాల" చేస్తారట


నందమూరి బాలకృష్ణ, పార్వతీ మెల్టన్‌, ఇషా చావ్లా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. రమేష్‌ పుప్పాల నిర్మాత. రవికుమార్‌ చావలి దర్శకుడు. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను ఇద్దరు భామలతో బాలయ్య కూడిన సన్నివేశాన్ని చిత్రించారు. డా||దాసరి నారాయణరావు క్లాప్‌ కొట్టగా, కృష్ణంరాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు.

బాలకృష్ణ మాట్లాడుతూ, ఇది నేను గర్వించే చిత్రంగా ఉంటుంది. కథలో కొత్తదనం ఉంది. సందేశం కూడా దర్శకుడు బాగా చూపించబోతున్నాడు. నా నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారో అంతా ఈ చిత్రంలో ఉంటుంది అన్నారు. ఎటువంటి కథాంశమని.. అడిగితే.. అప్పుడే ఎందుకంటూ.... రాజకీయ చిత్రమా? అని అడిగితే.... నవ్వే సమాధానంగా చెప్పారు. కనుక బాలకృష్ణ రాజకీయ అరగేంట్రంకు ఈ చిత్రం పనికివస్తున్నదన్నమాట.

దర్శకుడు మాట్లాడుతూ... బాలయ్య బాబు రియల్‌ క్వాలిటీస్‌ ఈ చిత్రంలో ఉపయోగించుకుంటున్నాం. కథాపరంగా అవి చాలా ఉపయోగపడతాయి. నిర్మాత మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందనీ, ఏకధాటిగా జరిగే షెడ్యూల్తో పూర్తి చేస్తామని చెప్పారు.

సి.ఎం.అయ్యాక..నర్తనశాల!
ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేశారు. జై బాలయ్య.. అంటూ నినాదాలు చేశారు. 'నర్తనశాల' ఎప్పుడూ అంటే... కొంతమంది... సి.ఎం. అయ్యాక.. అంటూ... పెద్దపెట్టున అరిచారు. దీంతో... బాలయ్య ముసిముసి నవ్వులు చిలికించారు.

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

"బాలకృష్ణ సీఎం అయ్యాక "నర్తనశాల" చేస్తే లాభమే. జబర్దస్తీగా సినిమా ఆషించటానికి తగినన్ని హంగులు చేతిలో ఉంటాయి. అప్పటికీ, ఒకవేళ ఆ సినిమా గనగ సరిగా ఆడకపోతే ప్రతిపక్షాల కట్ర అని ఋజువైపోయింది అనవచ్చు.

అజ్ఞాత చెప్పారు...

We are expecting some more mythological movies from BalaKrishna garu. Producers like Yalamamchi Sai Babu ( Sri Rama Rajyam ) should come forward to do more mythological films. So that the moral values among youth will increase.