11 ఫిబ్ర, 2012

గుట్టుగా వ్యవహారం - ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన హీరోయిన్

డ్రీమ్‌గర్ల్ హేమా మాలిని, ధర్మేంద్రల కూతురు ఇషాడియోల్ తన ఎంగేజ్ మెంట్ విషయాన్నిమీడియాకు చెప్పేసింది. వివరాల్లోకి వెళితే... సంవత్సర కాలంగా ఈ సుందరి ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త భరత్ తక్తానీతో సన్నిహితంగా వుంటోంది. గతంలో మీడియా వారు పలుమార్లు ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ బుకాయించేది. అయితే ఉన్నట్టుండి అతడితో ఎంగేజ్ మెంట్‌కు సిద్ధం అవుతున్నానని చెప్పి షాకిచ్చింది. ఈ జంట ఎంగేజ్‌మెంట్ వచ్చే ఆదివారం ముంబైలో జరుగనున్నట్లు తెలియజేసింది.

‘ఎంగేజ్‌మెంట్‌కు ఇంకా రెండురోజుల సమయమే వుంది. పూర్తిగా మా వ్యక్తిగత కార్యక్రమం. అందుకే మీడియా వారు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టొద్దు’ అని చెప్పింది ఆమె తల్లి హేమామాలిని. ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రేట్‌గా మెయిన్‌టెయిన్ చేసిన ఇషాడియోల్ ఒక్కసారిగా ఎంగేజ్‌మెంట్‌తో ముంబై మీడియాను ఆశ్యర్యపరిచింది.

2002లో ‘కోయి మేరా దిల్ సే పూచె’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ టెరంగ్రేటం చేసిన ఈభామ ‘ధూమ్’ లాంటి భారీ చిత్రాల్లో నటించినా...తల్లి మాదిరి స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేక పోయింది.

కామెంట్‌లు లేవు: