11 ఫిబ్ర, 2012

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2జి శాఖ ఆదాయం రూ.5,00,000 కోట్లు!



ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ - బీపీఓ శాఖల ఆదాయం పదిబిలియన్ డాలర్ ( రూ.5,00,000 కోట్లు)కి దాటుతుందని నాస్కామ్ సంస్థ తెలిపింది. కాగా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా పలు దేశాలపై ప్రభావం చూపినప్పటికీ, భారతదేశ ఐటీ శాఖ స్థిరంగా వృద్ధి చెందింది. 


ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఓ శాఖలో భారత్ 58 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత 2011-12వ సంవత్సరంలో ఇంతవరకు దేశ ఐటీ శాఖ ఎగుమతి 16.3 శాతంగాను, స్వదేశ వాణిజ్యం 16.7 శాతంగానూ అభివృద్ధి చెందింది.

ఇంకా టెక్నాలజీ శాఖ మొత్తం ఆదాయం 10,100 కోట్ల డాలర్‌ (రూ.5,05,000)గా వృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా. ఇందులో ఎగుమతి ద్వారా 6,900 కోట్ల డాలర్లను, స్వదేశ వాణిజ్యం ద్వారా 3,200 కోట్ల డాలర్లు పొందవచ్చునని అంచనా వేయబడింది.

దేశంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలలో చిన్న కంపెనీల వాటా 200 కోట్ల డాలర్‌గా ఉంది. ఇంకా ఐటీ, బీపీఓ శాఖలలో 27.70 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ సంస్థల ద్వారా 2,30,000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభించడం గమనార్హం. వచ్చే 2020వ సంవత్సరంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ద్వారా మొత్తం ఆదాయం 22,500 కోట్ల డాలర్‌ని మించుతుందని నాస్కామ్ సంస్థ అంచనా వేసింది.

కామెంట్‌లు లేవు: