11 ఫిబ్ర, 2012

జూ ఎన్టీఆర్‌పై అనుష్క కూడా అవే కామెంట్స్

నందమూరి చిన్నోడు జూ ఎన్టీఆర్‌పై హాట్ భామ అనుష్క చేసిన కామెంట్లు అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇవేమీ నెగెటివ్ కామెంట్స్ కాదులెండి...పాజిటివ్‌గానే ఈ హీరోని పొగిడేసింది. జూ ఎన్టీఆర్ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని, సినిమాల్లో అతని పెర్ఫార్మెన్స్ అద్భుతమని ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. కష్టతరమైన, పొడవైన డైలాగులు చెప్పడంలో...అదిరిపోయేలా స్టెప్పులు వేయడంలో జూనియర్ ఎక్సలెంట్ మెచ్చుకుంటోంది. 

ఇటీవల రవితేజ తన బర్తడే సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్ర్యూలో మాట్లాడుతూ డైలాగ్ డెలివరీలో, నటనలో జూనియర్ బెస్ట్ అంటూ పొగిడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా జూనియర్ ను ఇలానే ఆకాశానికి ఎత్తేశాడు. 

ఇలా వరుస పెట్టి అంతా జూ ఎన్టీఆర్ ను పొగిడేస్తుండటంతో అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఇప్పటి జనరేషన్లో టాలీవుడ్‌ను నెం.1 స్థానంలో ఏలగలిగే సత్తా ఉన్న ఏకైక హీరో మా జూనియర్ ఎన్టీఆరే అని, ఈ మధ్య మావోడికి పరిస్థితులు కలిసి రాలేదు కానీ లేకుంటే ఇప్పటికే నెం.1 స్థానం సొంతం చేసుకునే వాడని, త్వరలోనే తన ‘దమ్ము’ చూపిస్తాడని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: