11 ఫిబ్ర, 2012

ముడి చమురు ధరల్లో తేడాలు : పెరగనున్న పెట్రోల్ ధరలు!!


దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో స్వదేశీయంగా వీటి ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరలకు అనుకూలంగా స్వదేశంలో పెట్రోల్ ధరలు పెంచుకునేందుకు చమురు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. 

ఈ నేపథ్యంలో గత డిసెంబరు నెలలో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడంతో ముడి చమురు దిగుమతి ఖర్చు పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రెండు రూపాయలు చొప్పున పెంచాలని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. 

పైపెచ్చు.. ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో చలి ఎక్కువగా ఉండటంతో చమురు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా పెట్రోల్ డిమాండ్ పెరిగడం కూడా ఈ ధరల పెంపుదలకు మరో కారణంగా ఉంది.

కామెంట్‌లు లేవు: