6 ఫిబ్ర, 2012

ఇంటర్ విద్యార్థి కిడ్నాప్: రూ.కోటిన్నర డిమాండ్

అనంతపురం/హైదరాబాద్: కడప జిల్లాకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గురజాలలో ఇంటర్ చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థిని కొందరు కిడ్నాప్ చేశారు. అతనిని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ లాడ్జిలో ఉంచారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.కోటి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌ను కిడ్నాపర్లు లాడ్జిలో దారుణంగా హింసించారు. అతనిని దారుణంగా కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసులు లాడ్జీలను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ దురాఘతం బయట పడింది. కిడ్నాపర్లు ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. శ్రీకాంత్‌ను వారు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు.

మరోవైపు హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఎనిమిదేళ్ల సుజిత్ రెడ్డి అనే చిన్నారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, కిడ్నాపర్ల కోసం ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
   

కామెంట్‌లు లేవు: