5 ఫిబ్ర, 2012

యువీకి ఊపిరితిత్తుల కేన్సర్: జతిన్ చౌదరీ

Yuvraj Singh




చండీగఢ్: టీమిండియా ఎడమ చేతి వాటం ఆటగాడు యువరాజ్ సింగ్ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్టు యువీ ఫిజియోధెరపిస్టు జతిన్ చౌదరీ ఓ ప్రముఖ టివీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఈ సందర్బంలో జతిన్ చౌదరీ మాట్లాడుతూ కొంతకాలంగా ఊపిరితిత్తుల్లో కణితితో బాధపడుతున్న యువీ చికిత్స కోసం గతనెల 26న అమెరికా వెళ్లడం జరిగింది. 

అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతడికి కేన్సర్ ఉందని నిర్ధారించారు. అయితే కేన్సర్ ప్రాథమిక దశలో ఉన్నందున ప్రమాదమేమీ లేదని, కీమోథెరపీ చేయించుకుంటే సరిపోతుందని అతడికి వైద్యులు సూచించారు. మే నాటికి యువరాజ్ పూర్తిగా కోలుకునే అవకాశముందని వైద్యులు చెప్పినట్టు తాను వెల్లడించాడు. యువరాజ్ సింగ్ ఐపిఎల్‌లో పూణె వారియర్స్ టీమ్‌కి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఐతే ఏప్రిల్‌లో జరగనున్న ఐపిఎల్ 5 నుండి యువీ పూర్తిగా నిష్క్రమించాడు.

కామెంట్‌లు లేవు: