9 మార్చి, 2012

గాలి నెల ఆదాయం రూ.150 కోట్లు, అలీఖాన్ వెల్లడి

                               Gali Janardhan Reddy   
బెంగళూర్: మైనింగ్ కంపెనీల మామూళ్ల ద్వారానే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నెలసరి ఆదాయం రూ. 150 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన అలీఖాన్ వెల్లడించినట్లు సమాచారం. అలీఖాన్‌ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. సిబిఐ విచారణలో ఆయన ఆ విషయం వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అక్రమంగా రవాణా చేసే ముడి ఇనుముకు మైనింగ్ కంపెనీలు దాని విలువలో 30 శాతం చొప్పున మామూళ్లు చెల్లించాయని ఆయన చెప్పారు.

గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అధికారులు గత సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. కర్ణాటకలోని అక్రమ మైనింగ్‌పై సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, అలీఖాన్‌ను విచారిస్తున్నారు. అలీఖాన్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని, అతనితో ఏ విధమైన లావాదేవీలు లేవని గాలి జనార్దన్ రెడ్డి సిబిఐతో చెప్పినట్లు సమాచారం. జనార్దన్ రెడ్డికి సంబంధించిన పలు ఆస్తులు, ఆదాయ వివరాలను అలీఖాన్ సిబిఐ విచారణలో వెల్లడించినట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: