హీరోయిన్ శ్రియ, నిర్మాత మలేషియా పాండియన్ ల వివాదం రోజు రోజుకీ ముదురుతోంది.తను మళయాళంలో నటించిన పోకిరిరాజా చిత్రం రైట్స్ ని ఒప్పందాలకు విరుద్దంగా విడుదల చేస్తున్నారంటూ నిర్మాత పై కేసు పెట్టింది. అంతేగాక సినిమా విడుదలను ఆపుచేస్తానని బెదిరించింది. దాంతో నిర్మాత మలేషియా పాండియన్..తన చిత్ర విడుదలను నిషేధించాలని ప్రయత్నిస్తే నటి శ్రీయపై నష్టపరిహారం కేసు వేస్తానని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే మలయాళంలో మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ నటించిన చిత్రం పోకిరి రాజా. 2010లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు మలేషియా పాండియన్ రాజా పోకిరి రాజా పేరుతో తమిళంలోకి అనువదించారు.
త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో నటి శ్రీయ మలయాళ చిత్ర నిర్మాత థామస్ ఆంటోని మీద దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో మలయాళ చిత్రం పోకిరిరాజాను ఇతర భాషలలోకి అనువదించకూడదన్న నిబంధనతోనే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించానని పేర్కొన్నారు. ఈ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇప్పుడు నిబంధనను అతిక్రమించి పోకిరిరాజా చిత్ర అనువాద హక్కులను నిర్మాత విక్రయించారన్నారు. కాబట్టి ఇతర భాషల్లో ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని శ్రీయ పేర్కొన్నారు.
ఇక ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ..మలయాళ చిత్రం పోకిరిరాజా చిత్రం తమిళ అనువాద హక్కులను చిత్ర నిర్మాతనుంచి నిబంధనలకు లోబడే కొనుగోలు చేశానన్నారు. ఈ విషయంలో శ్రీయకు తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె తన చిత్రాన్ని నిషేధించే ప్రయత్నం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆమె ఆ విధంగా చర్యలు తీసుకుంటే తాను శ్రీయపై నష్టపరిహారం కేసు వేస్తానని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి