4 మార్చి, 2012

రిలీజ్ కు ముందే 'దమ్ము'40కోట్లు బిజినెస్

                                              Jr Ntr
బోయపాటి శ్రీను,ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం దమ్ము రిలీజ్ కు ముందే 40 కోట్లు బిజినెస్ చేసిందంటూ ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్ధ వార్తా కథనం ప్రచురించింది. వారు చెప్పిన దాని ప్రకారం...ఎన్టీఆర్‌తో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న 'దమ్ము' విడుదలకు ముందే సుమారు రూ.40 కోట్లు ఆర్జించి సత్తా చాటింది. అలెగ్జాండర్‌ వల్లభ నిర్మిస్తున్న పంపిణీ హక్కులు ఉత్తరాంధ్రకు రూ.3.45 కోట్లు, నెల్లూరు - కృష్ణ - గుంటూరు జిల్లాలకు రూ.7.2 కోట్లు, నైజాం - కర్ణాటకలకు రూ.11 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.2.10 కోట్లు, తూర్పుగోదావరికి రూ.2 కోట్లు రేట్లకు అమ్ముడైంది.
మరోపక్క 'దమ్ము' ఆడియో హక్కుల్ని వేల్‌ రికార్డ్స్‌ సంస్థ ఇప్పటికే మంచి రేట్‌ ఆఫర్‌ చేసి దక్కించుకుంది. ఇంకోపక్క ఓవర్‌సీస్‌, శాటిలైట్‌ హక్కులు కూడా భారీ మొత్తానికే అమ్ముడైనట్లు సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో 'దమ్ము'పై అంచనాలు గట్టిగానే ఉన్నాయని తెలుస్తోంది. త్రిష, కార్తికా నాయర్‌ హీరోయిన్స్ గా చేస్తున్న 'దమ్ము'చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

కామెంట్‌లు లేవు: