4 మార్చి, 2012

అందుకే ప్రభాస్ ని'రెబల్‌' అన్నాం

                                    Prabhas


పోరాటమే ఊపిరిగా చేసుకొన్న ఓ యువకుడి కథ ఇది. నలుగురి మంచికోసం ఎవ్వరినైనా ఎదిరించగల ధైర్యం అతనిది. అందుకే 'రెబల్‌' అన్నాం అంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన తాజా చిత్రం 'రెబల్‌'గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...గెలుపోటముల గురించి ఆలోచనే లేదు. ఏదైనా ఫలితం కనిపించాలంటే... ముందు రంగంలో దిగాలనేది అతని సిద్ధాంతం. ఏటికి ఎదురీదైనా పోరాడాలన్న నైజం తనది. ఎవ్వరికైనా పోటీ ఉంటుంది కానీ... ఎదురు తిరిగి నిలిచినవాడికి మాత్రం పోటీనే లేదంటాడు. అలాంటి ఓ యువకుడి లక్ష్యమేమిటో తెరపైనే చూడాలి...పేరుకు తగ్గట్టుగా మాస్‌, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కించాం. వినోదానికీ ప్రాధాన్యముంది. ప్రభాస్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాతలు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం. ఏకధాటిగా సాగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. లారెన్స్‌ సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు నిర్మాతలు. ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, మాటలు: స్వామి, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌.

కామెంట్‌లు లేవు: