ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవాలకు తెరలేపాలంటే అది టాటా మోటార్స్‌కే చెల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. లక్ష రూపాయలకే కారు (ప్రస్తుత ధర కాదులెండి..) అంటూ టాటా నానోను విడుదల చేసి మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన టాటా మోటార్స్, ఇప్పటికే నీటితో, గాలితో నడిచే కార్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా.. టాటా మోటార్స్‌కు చెందిన ఇంజనీర్ల బృందం మొక్కజొన్న నుండి వచ్చే ధృఢమైన పిండి పదార్థంతో కార్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ పదార్థాన్ని ఉపయోగించి కారు బాడీ ప్యానెల్స్‌ను తయారు చేస్తారు. మొక్కజొన్నను ఇప్పటికే సిడి (కాంపాక్ట్ డిస్క్)ల తయారీలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదార్థం ధృఢమైనదే కాకుండా అగ్నికి కూడా అంటుకోదు.
మొక్కజొన్న నుండి సేకరించే ఈ పదార్థం అధిక ధృఢత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండి మంచి భద్రతను కల్పిస్తుంది. ఇది తేలిక ఉండటం కారణంగా కారు బరువును తగ్గించి తద్వారా మైలేజీని పెంచేందుకు సహకరిస్తుంది. ఇప్పటికే ఈ తరహా పదార్థాన్ని ఇతర కంపెనీలు తమ కార్లలో ఉపయోగించి ప్రయోగిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టాటా మోటార్స్ దీన్ని పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకురావాలని యోచిస్తోంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి