9 మార్చి, 2012

త్రిశూల్ సిమెంట్‌పై జెసి దివాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసు

                                 JC Diwakar Reddy
హైదరాబాద్: త్రిశూల్ సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులు లీజుకు ఇచ్చిన వ్యవహారంలో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పాలపాడు వద్ద 1,605 ఎకరాల సున్నపు రాయి తవ్వకానికి త్రిశూల్ సిమెంట్ కంపెనీకి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తాడిపత్రికి చెందిన వి. మురళీప్రసాద్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్‌వి రమణ, జస్టిస్ పి. దుర్గాప్రసాద్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. 

లీజు వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు బెంచ్ గత నెల 13వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాల మేరుకు గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. గనుల లీజు 2006లో పొదినా ఇప్పటి వరకు సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. లీజు పొందడానికి జెసి దివాకర్ రెడ్డి తదితరులు తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపించారు. మిగతా వారంతా జెసి దివాకర్ రెడ్డి బినామీలేనని చెప్పారు.

కామెంట్‌లు లేవు: